
న్యూస్

లెబనాన్‌లో రష్యాకు చెందిన ఓ జర్నలిస్టు ఓ స్వీనీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అక్కడ జరుగుతున్న దాడులను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రత్యక్ష ప్రసారంలో రిపోర్టింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ఒక్కసారిగా ఒక మిసైల్ అతని వైపు దూసుకురావడం గమనించిన ఆయన వెంటనే పక్కకు తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. వెంటనే ఆ మిసైల్ అక్కడే పేలి భారీ శబ్దంతో విస్ఫోటనం సంభవించింది.
ఈ ఘటనలో జర్నలిస్టుతో పాటు కెమెరామెన్‌కు కూడా గాయాలు అయినట్లు సమాచారం. ఇద్దరూ తక్షణమే అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించబడ్డారు. మిసైల్ పేలిన ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మొత్తం లైవ్‌లో రికార్డవడం విశేషం. లెబనాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఈ వీడియో స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!