.jpg&w=3840&q=75)
న్యూస్

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ మెక్‌కలమ్‌పై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో మద్యం, సిగరెట్ల వినియోగాన్ని అనుమతించాడన్న ఆరోపణలు యాషెస్ సిరీస్ పరాజయం అనంతరం నిర్వహించిన సమీక్షలో బయటపడ్డాయి. ఆటగాళ్లు విశ్రాంతి సమయంలో నియంత్రణ లేకుండా ప్రవర్తించినట్లు, మైదానం బయట జరిగిన సంఘటనలు కూడా వివాదాలకు కారణమయ్యాయి.
అంతేకాక, కొందరు ఆటగాళ్లు క్యాసినోలకు వెళ్లడం, నైట్‌క్లబ్‌లలో వివాదాల్లో చిక్కుకోవడం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపిందని నివేదిక పేర్కొంది. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో కూడా మెక్‌కలమ్‌కు విభేదాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ పరిస్థితుల మధ్య కూడా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అతడినే అన్ని ఫార్మాట్లకు కోచ్‌గా కొనసాగించాలని నిర్ణయించడం విశేషంగా మారింది.








.webp&w=3840&q=75)
.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!