
టెక్నాలజీ

డేటా అవసరం లేని మొబైల్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కేవలం కాల్స్, SMSలతో రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని ట్రాయ్ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఎక్కువగా డేటా ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉండగా, వాయిస్ మరియు మెసేజ్ సేవలను మాత్రమే ఉపయోగించే వినియోగదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది.
ఈ మేరకు ట్రాయ్ టెలికం కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్-2026 డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలపై ఏప్రిల్ 28 వరకు ప్రజల నుంచి సూచనలు స్వీకరించనుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్లాన్లు తీసుకురావడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ట్రాయ్ వెల్లడించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!