
న్యూస్

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధాడింగ్ జిల్లాలో పొఖారా నుంచి కాఠ్మాండూ వెళ్తున్న ప్రయాణికుల బస్సు అదుపుతప్పి త్రిశూలీ నదిలో పడిపోవడంతో కనీసం 18 మంది మృతిచెందారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున పృథ్వీ హైవేపై జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 28 మంది గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల్లో న్యూజిలాండ్‌కు చెందిన ఒకరు, జపాన్ మరియు నెదర్లాండ్స్‌కు చెందిన ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. బస్సు అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!