
.jpg&w=3840&q=75)
కువైట్ నుండి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానం పై మంగళవారం తెల్లవారుజామున బాంబు ఉందంటూ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఉన్నతాధికారులకు ఈమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. సమాచారం అందిన వెంటనే అధికారులు పైలెట్‌ను అప్రమత్తం చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సిన ఈ విమానాన్ని అత్యవసరంగా ముంబైకి మళ్లించారు.
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన తరువాత ప్రయాణికులను వెంటనే విమానం నుంచి దింపి భద్రతా ప్రాంతానికి తరలించారు. అనంతరం బాంబు స్క్వాడ్ మరియు భద్రతా బృందాలు విమానంలో ముమ్మర తనిఖీలు ప్రారంభించాయి. మాములుగా ఈ ఇండిగో ఫ్లైట్ ఉదయం 8.10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరాల్సి ఉంది.
బాంబు బెదిరింపు కారణంగా విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన పై శంషాబాద్ మరియు ముంబై ఎయిర్పోర్ట్ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విమానంలో ఉన్న ప్రయాణికుల సంఖ్య లేదా సిబ్బంది వివరాలు ఇండిగో సంస్థ అధికారికంగా వెల్లడించలేదు.



















కామెంట్స్ (1)
బాంబు బెదిరింపుతో కలకలం