
గాసిప్స్

అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. సదుం మండలంలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ఫామ్లలో కోళ్లను చంపి పూడ్చే ప్రక్రియను అధికారులు చేపట్టారు. వ్యాధి వ్యాప్తి నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
సదుం, అమ్మగారిపల్లి, కంభంవారిపల్లి, పుట్టావాండ్లపల్లి గ్రామాల్లో అధికారులు పర్యటించి శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే చిత్తూరు జిల్లా కార్వేటినగరంలోని ఒక ఫామ్లో కూడా బర్డ్ ఫ్లూ కారణంగా సుమారు రూ.17 లక్షల విలువైన కోళ్లు మృతి చెందినట్లు సమాచారం అందింది.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చిత్తూరు జిల్లా కలెక్టర్ అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించాలని, అధికారులకు సహకరించాలని సూచించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!