

ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ సదస్సుగా గుర్తింపు పొందిన బయో ఏషియా 2026 ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా జరగనుంది. “టెక్బయో అన్లీష్డ్: ఏఐ, ఆటోమేషన్ – బయాలజీ రివల్యూషన్” అనే థీమ్‌తో నిర్వహించనున్న ఈ సదస్సును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సంయుక్తంగా ప్రారంభించనున్నారు. దాదాపు 50 దేశాల నుంచి 3,000 మందికిపైగా ప్రతినిధులు పాల్గొననున్న ఈ సదస్సులో లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాల్లో వస్తున్న తాజా మార్పులు, ఏఐ ప్రభావం, శాస్త్రీయ పురోగతిపై విస్తృత చర్చలు జరగనున్నాయి.
ఫార్మా, బయోటెక్, హెల్త్‌టెక్ రంగాల్లోని గ్లోబల్ సీఈఓలు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు పాల్గొనే ఈ సదస్సులో ప్రత్యేక సీఈఓ కాన్క్లేవ్, ప్యానల్ డిస్కషన్లు నిర్వహించనున్నారు. సెల్ అండ్ జీన్ థెరపీ, బయోలాజిక్స్, ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ మోడల్స్ వంటి కీలక అంశాలు అజెండాలో ఉన్నాయి. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్‌తో పాటు ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్, డాక్టర్ రెడ్డీస్, బయోకాన్, భారత్ బయోటెక్, నోవార్టిస్, రోష్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు. బయో ఏషియా 2026 ద్వారా హైదరాబాద్ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మరింత బలోపేతం కానుంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!