

స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2026 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ – అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని, ఆయనపై అపారమైన గౌరవం ఉందని ట్రంప్ ప్రశంసించారు.
సదస్సులో ప్రసంగం అనంతరం భారత వార్తా సంస్థ మనీకంట్రోల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇరు దేశాల మధ్య త్వరలోనే ఒక భారీ ట్రేడ్ డీల్ కుదరబోతుందని ట్రంప్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ప్రస్తుతం భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 191 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ కొత్త ఒప్పందం ద్వారా 2030 నాటికి దీనిని 500 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో విధించిన అదనపు సుంకాల వల్ల భారత ఎగుమతులు తగ్గినప్పటికీ, దావోస్లో ట్రంప్ చేసిన సానుకూల వ్యాఖ్యలతో వాటి తగ్గింపుపై ఆశలు పెరిగాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!