
గాసిప్స్

హుజూరాబాద్ పట్టణంలో ఓటు వేసిన బ్యాలెట్ పత్రాన్ని ఓటరు తన చరవాణితో ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడంతో కలకలం రేగింది. రెండో వార్డు నుంచి భాజపా అభ్యర్థి దున్నపోతుల ఎల్లమ్మకు ఓటు వేసిన అనంతరం ఆ బ్యాలెట్ పత్రాన్ని ఫొటో తీసి స్టేటస్‌గా పెట్టినట్లు సమాచారం. ఈ పోస్టును కొందరు భాజపా నాయకులు కూడా షేర్ చేయడంతో విషయం చర్చనీయాంశమైంది.
పోలింగ్ కేంద్రాలకు సెల్ఫోన్లు తీసుకెళ్లరాదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ ఈ ఘటన ఎలా జరిగిందనే అంశంపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. పోలింగ్ బూత్ అధికారి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగిందా అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!