

ఇయర్ ఎండ్ సెలవులు, వరుసగా వచ్చిన వీకెండ్ల కారణంగా అరకు లోయ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో టూరిస్టులు తరలిరావడంతో అరకు, పాడేరు, విశాఖ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. చల్లని వాతావరణం, దట్టమైన పొగమంచు కప్పుకున్న ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో పొగమంచుతో కనిపించే అరకు లోయ దృశ్యాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
పర్యాటకుల రద్దీ పెరగడంతో ఘాట్ రోడ్లపై వాహనాల రాకపోకలు పరిమితికి మించిపోయాయి. విశాఖ నుంచి అరకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. మరోవైపు హోటళ్లు, రిసార్ట్స్‌కు డిమాండ్ పెరగడంతో ముందస్తు బుకింగ్స్ లేకుండా గదులు దొరకడం కష్టంగా మారింది. ఇయర్ ఎండ్ వేడుకలతో పాటు చలికాల వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన పర్యాటకులతో అరకు లోయ ఈసారి పూర్తిగా హౌస్ ఫుల్‌గా మారింది.







.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!