
గాసిప్స్

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ నిన్న సోషల్ మీడియా వేదికగా ఫలితాలను ప్రకటించారు. అభ్యర్థులు తమ మార్క్స్ మెమో, ఫలితాలను www.tet2dsc.apcfss.in వెబ్సైట్లో పొందవచ్చని మంత్రి తెలిపారు.
గతేడాది డిసెంబర్ 10 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్ పరీక్షలకు మొత్తం 2,48,427 మంది అభ్యర్థులు హాజరుకాగా, అందులో 47.82 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వెబ్సైట్ హోంపేజీలో ఉన్న రిజల్ట్స్ లింక్‌ను క్లిక్ చేసి క్యాండిడేట్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేసిన తర్వాత స్కోర్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అభ్యర్థుల సౌకర్యార్థం 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఫలితాలు చూసే అవకాశం కల్పించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!