
సినిమాలు

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ విద్యా మండలి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
ఈ ఏడాది ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు 5,31,275 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,26,624 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో భద్రత, సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు విద్యా మండలి తెలిపింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!