
గాసిప్స్

ఉమెన్ వరల్డ్ కప్లో ప్రతిభను చాటి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన శ్రీచరణిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరించేందుకు నిర్ణయించింది. ఆమె అద్భుతమైన ప్రదర్శనకు గుర్తింపుగా నగదు బహుమతి సహా పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున శ్రీచరణికి రూ.2.50 కోట్ల నగదు బహుమతిని అందించనున్నారు. అలాగే కడపలో 1,000 చదరపు గజాల విస్తీర్ణంలో నివాస స్థలాన్ని కేటాయించనున్నారు. అదనంగా రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 హోదాలో నియామకం కల్పించాలని నిర్ణయించి, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది.




















కామెంట్స్ (1)
Good Decision by Govt.. Congratulations SriCharani..