

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు కీలక నగరాలు విజయవాడ–విశాఖపట్నం మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణాన్ని రైల్వేశాఖ పరిశీలిస్తోంది. ఈ 350 కి.మీ. పొడవైన మార్గం ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ మీదుగా వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గరిష్ఠంగా గంటకు 320 కి.మీ. వేగంతో బుల్లెట్ రైళ్లు నడిచే అవకాశం ఉంది. అమరావతి మీదుగా ఈ మార్గాన్ని అనుసంధానం చేస్తే హైదరాబాద్–అమరావతి–చెన్నై హైస్పీడ్ కారిడార్‌కు అనుసంధానం కలుగుతుంది. ఇదే సమయంలో విజయవాడ–కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ కారిడార్‌ను 350 కి.మీ. మేర గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, కంభం, నంద్యాల మీదుగా నిర్మించాలని ప్రతిపాదించారు. గంటకు 220 కి.మీ. వేగంతో రైళ్లు నడిస్తే రెండు గంటల్లో ప్రయాణం పూర్తవుతుంది.
ఇవికాకుండా మాచర్ల–గద్వాల్ (184 కి.మీ.), నెల్లూరు–రాజంపేట (120 కి.మీ.), సామర్లకోట–చింతూరు (150 కి.మీ.), కళ్యాణదుర్గం–అనంతపురం (58 కి.మీ.) కొత్త రైల్వే లైన్లకు ప్రతిపాదనలు పంపించారు. గూడూరు నుంచి దుగరాజపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టుకు రైల్వే లైన్ నిర్మాణానికి సర్వే చేయాలని భావిస్తున్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి రైలు మార్గం కల్పించేందుకు హైదరాబాద్–మార్కాపురం మధ్య 290 కి.మీ. కొత్త లైన్ ప్రతిపాదించారు. రైల్వే బోర్డు నుంచి ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి లభిస్తే ఈ ప్రాజెక్టులకు ముందడుగు పడనుంది.


.webp&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!