
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతుండగా, పెట్టుబడులు రావట్లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతిలో జరిగిన శాసనసభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైకాపా ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని, ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 6,28,327 ఉద్యోగాలు కల్పించామని, ఐదేళ్లలో 20 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
వైకాపా పాలనలో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను పునరుద్ధరించి, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా మార్చామని చంద్రబాబు తెలిపారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో రూ. 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని, వాటి ద్వారా సుమారు 16 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. అలాగే విశాఖపట్నంలో 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అమరావతిని క్వాంటమ్ మరియు నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చేస్తామని, రాయలసీమను స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల హబ్‌గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!