
సినిమాలు

అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో ఉన్న ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ నివసిస్తున్న దాదాపు పది మంది తెలుగు విద్యార్థులు ఒక్కసారిగా చెలరేగిన మంటలు, ఘాటైన పొగతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లోపల చిక్కుకున్న 13 మందిని బయటికి తీసుకువచ్చారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ హైదరాబాద్‌కు చెందిన సహజ రెడ్డి ఉడుముల మరియు కూకట్‌పల్లికి చెందిన మరో తెలుగు విద్యార్థి మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. వీరిరువురు అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నట్లు సమాచారం.




.webp&w=3840&q=75)


.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!