

సినీ నటి రేణు దేశాయ్ తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. తాను రాజకీయాలకు దూరమని, ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని స్పష్టంగా చెప్పారు. కొంతమంది చానల్స్ తన మాటలను వక్రీకరించి, ఇష్టం వచ్చినట్లు థంబ్‌నెయిల్స్ పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయాల కోసం కాదు, మనుషుల ప్రాణాల కోసం పోరాడుతున్నానని తెలిపారు.
తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. “నేను మీ పిల్లలకు కుక్కలు కరవాలని అనలేదు. నా పిల్లలకు కుక్క కాటు కావాలని మీరు ఎలా అంటారు” అని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే జీహెచ్ఎంసీకి కాల్ చేయాలని, లేకపోతే తనకు చెప్పితే తానే తీసుకెళ్తానని అన్నారు.
పవన్ కళ్యాణ్ పేరు తీసుకువచ్చి తన గురించి, తన వ్యక్తిగత జీవితంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం పూర్తిగా తప్పని రేణు దేశాయ్ మండిపడ్డారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!