

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మరణ సమయానికి ఆయన వయసు 90 సంవత్సరాలు. ఈ వార్తతో రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో విషాదం నెలకొంది.
నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రిగా, జనసేన కీలక నేతగా కొనసాగుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు అంతిమ నివాళులు అర్పించేందుకు ఆయన పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్‌లోని స్వగృహంలో ఉంచనున్నారు.
తన అంత్యక్రియలను హైదరాబాద్ పంజాగుట్టలోని హిందూ శ్మశానవాటికలో నిర్వహించాలని భాస్కరరావు ముందుగానే కుటుంబ సభ్యులకు సూచించినట్లు తెలిసింది. ఆయన కోరిక మేరకు రేపు మధ్యాహ్నం 4 గంటలకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!