

దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యను నియంత్రించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రణాళికలో భాగంగా నగరవ్యాప్తంగా సుమారు 25,000 వీధి కుక్కలపై ఒకేసారి చర్యలు చేపట్టనున్నారు. రాబోయే బడ్జెట్లో మైక్రోచిప్పింగ్, టీకాల కార్యక్రమాల కోసం రూ.35 కోట్లను కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ చర్యల ద్వారా ప్రజల భద్రతను మెరుగుపరచడంతో పాటు పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయనున్నారు.
మొత్తం కేటాయింపులో రూ.20 కోట్లను నేరుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఖర్చు చేయనుండగా, మిగిలిన రూ.15 కోట్లను నగరంలో ఇప్పటికే పనిచేస్తున్న జంతు సంక్షేమ సంస్థలు, ఎన్జీవోల ద్వారా అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వీధి కుక్కలపై సమగ్ర డేటాబేస్ రూపొందించడం, ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడం, పౌర సంస్థలు మరియు జంతు సంక్షేమ సంస్థల మధ్య సమన్వయం పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!