

సైబర్ నేరగాళ్ల చేతి లో మోసపోయిన బాధితులకు అండగా ఉండేందుకు హైదరాబా ద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రారంభించిన సీ-మిత్ర విభాగం సక్సెస్ అయ్యింది. ప్రారంభమైన 10 రోజుల్లోనే దాదాపు 100 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. విభాగం పోలీసులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో బాధితులను ఫోన్ ద్వారా సంప్రదించి వారి భయం, ఆందోళన తొలగించి ఫిర్యాదు చేయడానికి సహాయపడుతున్నారు.
సైబర్ మోసానికి గురైన వారు 1930 లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేస్తే, సీ-మిత్ర టీం ఆ ఫిర్యాదులను గుర్తించి AI సహాయంతో పూర్తి వివరాలు సరిచూసి ఫిర్యాదు కాపీని బాధితుడికి పంపిస్తుంది. బాధితుడు సంతకం చేసిన తర్వాత, ఈ కాపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుగా నమోదు చేయబడుతుంది.
ఇలా సీ-మిత్ర టీం బాధితుల ఫిర్యాదు ల్లో గందరగోళం లేకుండా అన్ని వివరాలు స్పష్టం గా ఉండేలా చేసి దర్యాప్తు వేగవంతంగా జరిగేలా తోడ్పడుతుంది. సీ-మిత్ర సేవల ను బాధితులు ప్రశంసిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!