
గాసిప్స్

భారీ వర్షాల ప్రభావంతో తిరుమలలో భక్తుల రద్దీ కొంత మేర తగ్గింది. అయితే సోమవారం రాష్ట్రాల నుంచి, సమీప ప్రాంతాల నుంచి భక్తులు మోస్తరు సంఖ్యలో చేరుకున్నారు. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు సాధారణ దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు తీసుకున్న భక్తులు అయితే సుమారు ఒక గంటలోనే శ్రీవారి దర్శనం పొందుతున్నారు.
మంగళవారం ఉదయం వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కేవలం 8 కంపార్ట్మెంట్ల వరకే భక్తుల వేచి చూసే క్యూ కొనసాగింది. సోమవారం మొత్తం 70,345 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే 24,292 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హుండీ ఆదాయం మాత్రం మంచి స్థాయిలోనే కొనసాగుతోంది. సోమవారం రోజున హుండీ ద్వారా రూ.3.43 కోట్లు సమీకరణైందని టీటీడీ అధికారులు తెలిపారు.




















కామెంట్స్ (1)
తిరుమలలో భారీ వర్షాల మధ్య కూడా భక్తుల భక్తి తగ్గడం లేదు.