
గాసిప్స్

యాదాద్రి జిల్లాలో అత్యధిక, భద్రాద్రిలో అత్యల్ప ఓటింగ్
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 53.57 లక్షల ఓటర్లలో 45.15 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించారు. జిల్లాలవారీగా చూస్తే, యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92.88 శాతం ఓటింగ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం కనిష్ఠంగా 71.79 శాతం ఓటింగ్ జరిగింది.
నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కూడా 90 శాతం మందికి పైగా ప్రజలు ఓటు వేశారు. అర్ధరాత్రి వరకు 3,300 సర్పంచ్ స్థానాలు, 24,906 వార్డు సభ్యుల స్థానాల లెక్కింపు పూర్తయిందని అధికారులు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!