
జనరల్

బలగం సినిమాతో దర్శకుడిగా ఘన విజయం సాధించిన వేణు యెల్దండి తన తదుపరి చిత్రం ఎల్లమ్మతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
ఈ సినిమా ఎల్లమ్మను కొలిచే చిందు యక్షగానం కళాకారుల కుటుంబం చుట్టూ సాగుతుందని గేయరచయిత కాసర్ల శ్యామ్ వెల్లడించారు. కుటుంబ అనుబంధాలు, గ్రామీణ జీవితం, తల్లి సెంటిమెంట్, ప్రేమకథతో పాటు ఎల్లమ్మ దేవతకు కళాకారులతో ఉన్న అనుబంధాన్ని ఈ చిత్రంలో చూపించనున్నట్లు తెలిపారు. దీంతో ఎల్లమ్మ కథాంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!