

మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న గ్లోబ్‌ట్రాటర్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. నవంబర్ 15 న రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ టైటిల్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. అయితే ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు అప్రమత్తంగా మారాయి. దీంతో పెద్ద పబ్లిక్ ఈవెంట్స్ నిర్వహణకు అనుమతులు పునఃసమీక్షలో ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికి గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ పనులు యథావిధిగా కొనసాగుతున్నాయి. అనుమతి లభిస్తే కఠినమైన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు. అభిమానులు ప్రశాంతంగా ఉండి పోలీసులకు సహకరించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కే.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2027 లో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో గ్లోబ్‌ట్రాటర్ విడుదల కానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!