

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం థియేట్రికల్ పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది.
కర్ణాటకలో ‘స్పిరిట్’ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్రముఖ పంపిణీ సంస్థ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్‌కు కర్ణాటకలో ఉన్న విశేష ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ ఒప్పందం కుదిరిందని, ఈ భాగస్వామ్యంతో కర్ణాటక బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చిత్రబృందం తెలిపింది. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!