

ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏక్నాథ్ షిండే వర్గంలో ఆరుగురు లోక్సభ ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం తెలిపిన ఉత్తర్వులను రద్దు చేయాలని అత్యవసర పిటిషన్లో కోరింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ఈ విలీనానికి ఆమోదం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించే అంశాన్ని పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం వెల్లడించింది.
ఉద్ధవ్ వర్గం వాదన ప్రకారం, ఈ విలీనం అనంతరం లోక్సభలో షిండే వర్గం బలం 13 మంది ఎంపీలకు పెరగగా, ఉద్ధవ్ శివసేన ఎంపీల సంఖ్య మూడు స్థానాలకు తగ్గింది. ఎన్నికల్లో ఎవరికైతే వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచారో, అదే రాజకీయ వర్గంలో విలీనం కావడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టులో వాదించింది. స్పీకర్ ఉత్తర్వులను రద్దు చేసి తగిన ఉపశమనం కల్పించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!