

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కరుప్పు చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ ఎలాంటి కట్స్ లేకుండా ‘15’ సర్టిఫికేట్ ఇవ్వగా, భారతదేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇప్పటికే ‘యూ/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ చిత్రం ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
యూకే, యూరప్ ప్రాంతాల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్న అహింస ఎంటర్టైన్మెంట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు ఆర్జే బాలాజీ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారని నిర్మాణ సంస్థ ప్రశంసించింది. గత ఏడాది సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.
ఈ చిత్రంలో సూర్య ‘శరవణన్’ అనే లాయర్ పాత్రతో పాటు ‘కరుప్పు’ అనే మరో శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, పంచ్ డైలాగులతో ఇది పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండనుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటిస్తుండగా, యోగి బాబు, ఇంద్రాన్స్, శివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందించగా, సినిమాటోగ్రఫీని జీకే విష్ణు నిర్వహించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!