

అల్లు అర్జున్ తన వ్యక్తిగత జీవితంలోని అందమైన క్షణాలను అభిమానులతో పంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈరోజు తన కుమార్తె అల్లు అర్హ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రత్యేక పోస్ట్ చేశారు. అర్హతో కలిసి ఉన్న అందమైన ఫొటోను షేర్ చేస్తూ.. “నా జీవితంలోని ఆనందానికి పుట్టినరోజు శుభాకాంక్షలు #AlluArha” అంటూ ప్రేమగా విషెస్ తెలిపారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే మూడు లక్షలకు పైగా లైక్స్ రావడంతో పాటు, అభిమానులు, నెటిజన్లు కామెంట్ల రూపంలో అల్లు అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తున్న ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ డ్రామా రాకా సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు, ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో కూడా అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నారు. వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బన్నీ, తన తదుపరి సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!