

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదుపరి చిత్రం ‘హైందవ’ విడుదల వాయిదా పడింది. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు. తొలుత ఈ సినిమాను నవంబర్ 27న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే, తాజాగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో ఇప్పటికే పలు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో ‘హైందవ’ విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
దేవాలయాల్లోని విగ్రహాలు అదృశ్యం కావడం అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. జేడీ చక్రవర్తి, సౌరభ్ సచ్‌దేవా, మహేశ్ మంజ్రేకర్, శివాజీ రాజా, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేశ్ చందు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. కొత్త విడుదల తేదీపై మేకర్స్ నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!