

నటి కీర్తి సురేశ్ తన వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారాలపై గతంలో వచ్చిన రూమర్స్ గురించి తాజాగా స్పందించారు. తనకు ఇండస్ట్రీలో పలువురు నటులతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగినప్పుడు ఎంతో బాధపడినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన సినిమా ‘సత్యవాన్ సావిత్రి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భర్త ఆంటోనీ తటిల్‌తో తన అనుబంధం, గతంలో వచ్చిన వార్తలపై మాట్లాడారు. ఇప్పటివరకు తాను ఒక్కరినే ప్రేమించానని, అది కూడా ఆంటోనీనే అని స్పష్టం చేశారు. అలాంటి వార్తలు వచ్చినప్పుడు వాటిపై స్పందించాలా అని ఆంటోనీ అడిగేవారని, అయితే అంతకుమించి ఎప్పుడూ తనను ప్రశ్నించలేదని తెలిపారు. తమ ఇద్దరికీ ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు ఇతరులకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, అందుకే రూమర్స్‌ను పట్టించుకోవడం లేదని చెప్పారు.
తన భర్త ఆంటోనీ ఎంతో మంచి వ్యక్తి అని, తన కెరీర్‌కు ఎప్పుడూ అండగా నిలుస్తుంటారని కీర్తి సురేశ్ పేర్కొన్నారు. తాను నిరాశలో ఉన్నప్పుడు ధైర్యం చెబుతూ, ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తారని తెలిపారు. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హడావుడి, ప్రచార కార్యక్రమాలు ఆంటోనీకి పెద్దగా ఇష్టం ఉండవని, అందుకే ఆయనను ఇబ్బందికర పరిస్థితుల్లోకి తీసుకెళ్లకూడదని భావిస్తానని చెప్పారు. కాగా, కీర్తి సురేశ్, ఆంటోనీ తటిల్ దాదాపు 15 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. అనంతరం 2024లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!