

బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మైలురాయిని దాటిన ‘హనుమాన్ అంశ్’ సినిమా విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఓ పీవీఆర్ థియేటర్‌కు గురుకుల విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో సినిమాను చూసేందుకు తరలివచ్చారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో థియేటర్‌లోకి వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సినిమాపై మరోసారి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర, బోధనల ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది ‘హనుమాన్ అంశ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తూ సత్తా చాటుతోంది. సినిమా విజయంతో పాటు గురుకుల విద్యార్థులు థియేటర్‌కు తరలిరావడం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!