7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

Writer: Chandrika 12:45 PM, 7 సెప్టెంబర్, 2026
మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

మహిళలను కించపరిచేలా లేదా అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ హెచ్చరించారు. శాసనసభలో మాట్లాడుతూ.. భావప్రకటనా స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని, తాము మాట్లాడే మాటలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు. ద్వంద్వార్థాలు వచ్చే పదాలను ఉపయోగిస్తూ మాట్లాడేవారిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రతి ఇంట్లో తల్లి, అక్కా చెల్లెళ్లు ఉంటారని, మహిళలను అవమానించేలా మాట్లాడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని, ఇదే శాసనసభలో జయలలిత ఎదుర్కొన్న అవమానాలను కూడా అందరూ చూశారని విజయ్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై వచ్చిన విమర్శలపైనా విజయ్‌ స్పందించారు. పోలీస్‌ వ్యవస్థ కేవలం అరెస్టులు చేయడానికి మాత్రమే కాదని, రాష్ట్ర అభివృద్ధికి అది కీలకమైన పునాది అని అన్నారు. చట్టాన్ని పాటించే వారికి పోలీసులు మిత్రులుగా, ఉల్లంఘించే వారికి కఠినంగా వ్యవహరించే వ్యవస్థగా ఉండాలని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. విమర్శలపై దృష్టి పెట్టకుండా అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అవినీతిని ఏమాత్రం సహించబోమని పునరుద్ఘాటిస్తూ.. అధికారులు అవినీతికి పాల్పడితే వారి కుటుంబాలు సైతం సమాజంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. లాకప్‌లో జరిగే నేరాలను సాధారణ ఘటనలుగా చూడబోమని, ఇలాంటి ఘటనలపై మేజిస్ట్రేట్‌ ద్వారా పారదర్శక విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫేక్ వీడియో వివాదంపై అభిజిత్ దీప్కే వివరణ

ఫేక్ వీడియో వివాదంపై అభిజిత్ దీప్కే వివరణ

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

గంటలో  34 పోస్టులు చేసిన ట్రంప్‌...

గంటలో 34 పోస్టులు చేసిన ట్రంప్‌...

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం
ట్యాగ్లు
తమిళనాడుసీఎం విజయ్విజయ్త్రిషఉదయనిధి స్టాలిన్మహిళల భద్రతభావప్రకటనా స్వేచ్ఛశాంతిభద్రతలుఅవినీతితమిళనాడు రాజకీయాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం: సీఎం చంద్రబాబు

సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం: సీఎం చంద్రబాబు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..
జనరల్

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..

సింగరేణి ‘మారుపేర్ల’ సమస్యకు పరిష్కారం చూపిస్తాం: భట్టి విక్రమార్క
జనరల్

సింగరేణి ‘మారుపేర్ల’ సమస్యకు పరిష్కారం చూపిస్తాం: భట్టి విక్రమార్క

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్‌ హాల్‌’ ప్రారంభం..
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్‌ హాల్‌’ ప్రారంభం..

క్రాకటోవా విస్ఫోటం.. 301 విమాన సర్వీసులకు బ్రేక్‌!
జనరల్

క్రాకటోవా విస్ఫోటం.. 301 విమాన సర్వీసులకు బ్రేక్‌!

బిగ్‌బాస్‌ 10లో కమెడియన్‌ నరేశ్‌.. నవ్వుల పంచ్‌లతో అలరించనున్నాడా?
షోస్

బిగ్‌బాస్‌ 10లో కమెడియన్‌ నరేశ్‌.. నవ్వుల పంచ్‌లతో అలరించనున్నాడా?

నిజామాబాద్‌ నుంచి బిగ్‌బాస్‌ వరకు.. ఆర్జే చరణ్‌ ఆసక్తికర ప్రయాణం
షోస్

నిజామాబాద్‌ నుంచి బిగ్‌బాస్‌ వరకు.. ఆర్జే చరణ్‌ ఆసక్తికర ప్రయాణం

బిగ్‌బాస్‌ 10: నరేశ్‌, రాంప్రసాద్‌ స్నేహం.. ఆటలో బలమవుతుందా? వైరంగా మారుతుందా?
షోస్

బిగ్‌బాస్‌ 10: నరేశ్‌, రాంప్రసాద్‌ స్నేహం.. ఆటలో బలమవుతుందా? వైరంగా మారుతుందా?

కార్ల మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్
బిజినెస్

కార్ల మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్

కేసీఆర్ ఫామ్‌హౌస్ రాజకీయాలపై సీతక్క ఫైర్
రాజకీయాలు

కేసీఆర్ ఫామ్‌హౌస్ రాజకీయాలపై సీతక్క ఫైర్

అసెంబ్లీ ముట్టడికి బీజేపీ యత్నం...రాంచందర్ రావు అరెస్ట్
జనరల్

అసెంబ్లీ ముట్టడికి బీజేపీ యత్నం...రాంచందర్ రావు అరెస్ట్

తండ్రితో చివరి ఫోన్ కాల్...యువతి షాకింగ్ నిర్ణయం
జనరల్

తండ్రితో చివరి ఫోన్ కాల్...యువతి షాకింగ్ నిర్ణయం

 ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
రాజకీయాలు

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం