

నల్ల చీరలు ధరించిన మహిళా ఎమ్మెల్యేల పట్ల తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పితృస్వామ్యాన్ని అంతం చేయాలి’ అంటూ రాహుల్ గాంధీ పిలుపునిస్తుంటే.. కాంగ్రెస్ పాలనలోని తెలంగాణలో నల్ల చీరలు ధరించిన మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రాజకీయాల్లోకి రాకముందే పితృస్వామ్యాన్ని సవాలు చేశారని పేర్కొన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు భారత ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు.
అదే సమయంలో తెలంగాణలో నల్ల దుస్తులపై ఏమైనా నిషేధం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. నల్ల రంగు దుస్తులు ధరించడాన్ని రాష్ట్రంలో ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నల్ల దుస్తులు పార్లమెంట్‌లో మాత్రమే అనుమతిస్తారా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. నల్ల చీరలు ధరించిన మహిళా ఎమ్మెల్యేలపై జరిగినట్లు ఆరోపిస్తున్న పోలీసుల చర్యల నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య మరో రాజకీయ వివాదానికి దారితీసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!