7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

Writer: Chandrika 12:22 PM, 7 సెప్టెంబర్, 2026
శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

తిరుమల బ్రహ్మోత్సవాలు నేడు తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే మహోత్సవంగా ప్రసిద్ధి చెందాయి. ధ్వజారోహణం నుంచి చక్రస్నానం వరకు, ఉదయం-సాయంత్రం వాహన సేవలు, లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణతో సప్తగిరులు మార్మోగుతాయి. అయితే ఈ వైభవం ఒక్కరోజులో రూపుదిద్దుకున్నది కాదు. శతాబ్దాలుగా రాజులు, రాణులు, సామంతులు, అధికారులు, భక్తులు అందించిన దానధర్మాలు, ఆలయ పరిపాలనా మార్పులు, ఆగమ సంప్రదాయాలు, కాలానుగుణంగా ఏర్పడిన ఉత్సవాలు కలిసి నేటి బ్రహ్మోత్సవాల రూపాన్ని తీర్చిదిద్దాయి. పురాణ కథనాలకే పరిమితం కాకుండా తిరుమల ఆలయ గోడలపై చెక్కిన శాసనాలు ఈ ఉత్సవాల చారిత్రక పరిణామానికి కీలక ఆధారాలుగా నిలుస్తున్నాయి. పల్లవ రాణి సామవై పెరుందేవి సమర్పించిన వెండి భోగ శ్రీనివాసమూర్తి, ఆభరణాలు, ఉత్సవాల నిర్వహణకు చేసిన భూదానాలకు సంబంధించిన శాసనం 10వ శతాబ్దంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు సూచిస్తోంది.

చోళులు, యాదవరాయులు, విజయనగర రాజుల కాలంలో బ్రహ్మోత్సవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. శ్రీకృష్ణదేవరాయలు 1513లో తన జన్మమాసంలో కొత్త బ్రహ్మోత్సవాన్ని ఏర్పాటు చేసినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. అచ్యుతరాయుల కాలంలో 1533లో కార్తీ బ్రహ్మోత్సవం ప్రస్తావన కనిపించగా, 1539లో తాళ్లపాక పెద తిరుమలయ్యంగార్‌ ఆధ్వర్యంలో ఆణి బ్రహ్మోత్సవం ఏర్పడింది. శాసనాల ప్రకారం మలయప్పస్వామిని ఉత్సవమూర్తిగా వినియోగించే సంప్రదాయం కూడా పాతకాలం నుంచే ఉంది. విజయనగర సామ్రాజ్య కాలం చివరి దశకు వచ్చేసరికి సంవత్సరానికి పది బ్రహ్మోత్సవాల వరకు నిర్వహించినట్లు ఆధారాలు ఉన్నాయి. అంతకుముందు చోళులు, యాదవరాయుల కాలంలో కొత్త ఉత్సవాలు చేరడంతో విజయనగర సామ్రాజ్యం ఏర్పడే నాటికి ఏడాదికి ఐదు బ్రహ్మోత్సవాలు నిర్వహించే స్థాయికి సంప్రదాయం చేరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

గంటలో  34 పోస్టులు చేసిన ట్రంప్‌...

గంటలో 34 పోస్టులు చేసిన ట్రంప్‌...

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం: సీఎం చంద్రబాబు

సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం: సీఎం చంద్రబాబు

చంద్రబాబు జల ప్రస్థానానికి ఈటీ ప్రశంసలు

చంద్రబాబు జల ప్రస్థానానికి ఈటీ ప్రశంసలు

ట్యాగ్లు
తిరుమల బ్రహ్మోత్సవాలుతిరుమల ఆలయంతిరుపతిశ్రీవేంకటేశ్వరస్వామిబ్రహ్మోత్సవాల చరిత్రటీటీడీఆలయ శాసనాలువిజయనగర సామ్రాజ్యంశ్రీకృష్ణదేవరాయలుహిందూ ఆలయ చరిత్ర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫేక్ వీడియో వివాదంపై అభిజిత్ దీప్కే వివరణ
జనరల్

ఫేక్ వీడియో వివాదంపై అభిజిత్ దీప్కే వివరణ

మమ్ముట్టి కొత్త మూవీ ‘మేళా’ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

మమ్ముట్టి కొత్త మూవీ ‘మేళా’ ఫస్ట్ లుక్ విడుదల

ఆషికా ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్
గాసిప్స్

ఆషికా ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా? వైద్యుల సూచన ఇదే
ఆరోగ్యం

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా? వైద్యుల సూచన ఇదే

వర్షాకాలంలో చెవులను ఇలా కాపాడుకోండి - వైద్యుల సూచన
ఆరోగ్యం

వర్షాకాలంలో చెవులను ఇలా కాపాడుకోండి - వైద్యుల సూచన

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..
జనరల్

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్
బిజినెస్

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్
జనరల్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?
టెక్నాలజీ

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?

గంటలో  34 పోస్టులు చేసిన ట్రంప్‌...
జనరల్

గంటలో 34 పోస్టులు చేసిన ట్రంప్‌...

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..
జనరల్

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం
జనరల్

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!