

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తాజాగా సినిమాకు సంబంధించిన కథాంశంపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనకు మొదటి నుంచీ సాహస కథలంటే ప్రత్యేకమైన ఇష్టమని చెప్పిన ఆయన, ‘వారణాసి’లో భారీ స్థాయి ప్రయాణంతో పాటు ఆఫ్రికా, అంటార్కిటికా వంటి ప్రాంతాల నేపథ్యాలు ఉంటాయని తెలిపారు.
కాల ప్రయాణం వంటి ఆసక్తికరమైన అంశాలు కూడా కథలో భాగంగా ఉంటాయని రాజమౌళి వెల్లడించారు. వీటితో పాటు తండ్రి, కొడుకుల మధ్య సాగే భావోద్వేగ బంధం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. ఈ వివరాలతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎస్. కార్తికేయ, కే.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. ‘వారణాసి’ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న భారీ స్థాయిలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!