

రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీఈవో జితేంద్ర మిశ్రాను టార్గెట్ చేస్తూ ఎక్స్‌లో వీడియో షేర్ చేసిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తాజాగా వివరణ ఇచ్చారు. తాను షేర్ చేసిన వీడియో ఫేక్ అని తనకు ముందుగా తెలియదని స్పష్టం చేశారు. ఎవరి వ్యక్తిగత జీవితం వారిదేనని, వారు తమకు నచ్చిన విధంగా జీవించడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఆదివారం బాబీ డియోల్ నటించిన ‘జమాల్ కుడు’ పాటకు ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన అభిజిత్.. అతడిని జితేంద్ర మిశ్రాగా పేర్కొన్నారు. ధర్మాన్ని కాపాడేవాళ్లమని చెప్పుకునే వారు ఇలాంటి విషయాలపై ఆలోచించుకోవాలని, రామజన్మభూమి ట్రస్ట్ సీఈవో ఇలాంటి పనులు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
అయితే, ఓ ఫేక్ వీడియోను సీజేపీ వ్యవస్థాపకుడి హోదాలో ఉన్న వ్యక్తి షేర్ చేయడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించిన అభిజిత్.. వీడియో నకిలీదని తనకు తెలియదని మరోసారి స్పష్టం చేశారు. కాగా, రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఇటీవల రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీఈవోగా నియమితులయ్యారు. 62 ఏళ్ల మిశ్రా భారత వైమానిక దళంలో సేవలందించి పలు పతకాలు అందుకున్నారు. గత ఏడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆయన వెస్ట్రన్ కమాండ్‌కు సారథ్యం వహించినట్లు పేర్కొనబడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!