
జనరల్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన కొత్త చిత్రం సంబరాల ఏటిగట్టుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హనుమాన్ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తున్నారు. యంగ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ విజువల్ వండర్‌లో షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఐశ్వర్య లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి ఆమె పాత్రను రివీల్ చేశారు. సంబరాల ఏటిగట్టు బృందం తరఫున శుభాకాంక్షలు తెలిప్తూ, ఆమెను వసంతగా పరిచయం చేస్తూ ఆ గ్రామీణ ప్రపంచంలో కొత్త ఉల్లాసం, ఆప్యాయత నింపుతుందని పేర్కొన్నారు. ఈ చిత్రం 2027 జనవరి 12న విడుదల కానున్నట్లు మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!