

విభిన్న కథలు, సహజమైన నటనతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్ ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. ‘మండాడి’ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఆయన ఇందులో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. సూరి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మతి మారన్ దర్శకత్వం వహించారు. సముద్రం, పడవల పోటీల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ట్రైలర్‌ను విడుదల చేసి సుహాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ట్రైలర్‌లో సూరి, సుహాస్ ఇద్దరూ తమ పాత్రల్లో బలంగా కనిపించారు. రెండు జట్ల నాయకుల మధ్య సాగే పోటీ, ఘర్షణ ఆసక్తిని పెంచుతున్నాయి. తమిళ వెర్షన్‌లో సుహాస్ స్వయంగా డబ్బింగ్ చెప్పకపోయినా, తెలుగు వెర్షన్‌కు తన గొంతును అందించారు. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే సూరి తెలుగు డబ్బింగ్‌పై మరింత శ్రద్ధ పెట్టాల్సిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 10న తమిళం, తెలుగులో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!