

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో గంట వ్యవధిలోనే 34 పోస్టులు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏఐ సాంకేతికతతో రూపొందించిన చిత్రాలు, ఆసక్తికర వ్యాఖ్యలతో ఆయన వరుస పోస్టులు చేశారు. ముఖ్యంగా ఇరాన్‌కు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ దేశ కీలక చమురు ఎగుమతి కేంద్రంగా ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని ప్రస్తావిస్తూ ‘బై బై ఖర్గ్’ అంటూ ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. ఇరాన్ పటంపై తన ముఖం కనిపించేలా రూపొందించిన ఏఐ చిత్రాన్ని కూడా పంచుకున్నారు.
ఇక ‘చంద్రుడు మాకే సొంతం’ అన్న భావనను వ్యక్తం చేస్తూ మరో పోస్టు చేశారు. అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్ర సూచిక బోర్డును ‘న్యూ అమెరికా’గా మార్చినట్లు చూపించే ఏఐ చిత్రాన్ని కూడా షేర్ చేశారు. అయితే న్యూ మెక్సికో రాష్ట్రం పేరును మార్చేందుకు ట్రంప్ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ పోస్టులు ఆన్‌లైన్‌లో చర్చకు దారితీశాయి. గతంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా పేర్కొనేలా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!