

హీరో, నిర్మాత కిరణ్ అబ్బవరం నిర్మించిన తాజా చిత్రం "తిమ్మరాజుపల్లి టీవీ" ఈ నెల 17 న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతుండగా, వి. మునిరాజు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ డ్రామా ప్రివ్యూ షోలతోనే మంచి స్పందన తెచ్చుకుని ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది.
ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం ఈ సినిమా కుటుంబంతో కలిసి చూసేలా ఎమోషన్స్‌తో నిండినదని తెలిపారు. సహజమైన కథనం, నిజ జీవితానికి దగ్గరైన పాత్రలు, వంశీకాంత్ సంగీతం, అక్షయ్ రామ్ అందమైన విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులకు తమ ఊరి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, భావోద్వేగ అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేసింది.














.jpg&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!