
జనరల్

హీరో నాగచైతన్య ప్రస్తుతం కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వృషకర్మ' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీని తర్వాత చైతన్య ఏ సినిమా చేయనున్నారనే విషయంపై ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. గతంలో 'బెదురులంక 2012' దర్శకుడు క్లాక్స్ ఆయనకు ఓ కథ వినిపించినట్లు వార్తలు వచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం, 'మసూద' దర్శకుడు సాయి కిరణ్ కూడా నాగచైతన్యకు ఓ హారర్ థ్రిల్లర్ కథ వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నాయని, కథపై పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే చైతన్య తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!