

కోలీవుడ్ నటుడు సూరి, టాలీవుడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘మండాడి’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా తీర ప్రాంతం, మత్స్యకారుల జీవన విధానం నేపథ్యంలో సాగనుంది. మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్చుత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో సుహాస్ తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.
తాజాగా చిత్రబృందం సినిమా విడుదల వాయిదా పడినట్లు ప్రకటించింది. ముందుగా సెప్టెంబర్ 4న విడుదల చేయాలని భావించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌గా జూలై 18న తొలి పాట ప్రోమో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సూరి, సుహాస్ మాస్ లుక్‌లో కనిపిస్తున్న కొత్త పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!