
బిజినెస్

జై భీమ్ చిత్రంతో ప్రశంసలు అందుకున్న హీరో సూర్య, దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ మరోసారి కలిసి పని చేయనున్నారు. హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి సంబంధించిన చిత్రాలను విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. గత విజయవంతమైన కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం సూర్య 48 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సూర్య, కయాదు లోహర్, నిర్మాత విజయ్ కిరగందూర్, చలువే గౌడ, దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కతీర్ ఛాయాగ్రాహకుడిగా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!