

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ విజయంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఆయన. దర్శకుడు మేర్లపాక గాంధీ, నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలను అభినందించారు. హారర్ కామెడీకి కొరియన్ ఫ్లేవర్, కల్చర్‌ను జోడించడం అద్భుతమైన ఆలోచన అని ప్రశంసించారు. వరుణ్ తేజ్ విభిన్న కథలు, పాత్రలను ఎంచుకుంటూ నటుడిగా తనను తాను నిరూపించుకుంటున్నారని కొనియాడారు.
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ సినిమా విజయానికి సహకరించిన నిర్మాతలు, దర్శకుడు, నటీనటులు, టెక్నీషియన్లు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. నాగబాబు వరుణ్ విజయంపై గర్వం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు క్రిష్, రితిక నాయక్, మురళీధర్ గౌడ్, కాసర్ల శ్యామ్ తదితరులు కూడా చిత్ర బృందాన్ని అభినందిస్తూ, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా థియేటర్లలో మంచి స్పందనతో కొనసాగుతోందని చిత్ర బృందం పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!