

కామెడీ హీరో అల్లరి నరేష్ మరోసారి తన మార్క్ ఎంటర్‌టైన్మెంట్‌తో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ కామెడీ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ ఇప్పటికే టైటిల్‌తోనే ఆసక్తిని పెంచగా, తాజాగా విడుదలైన టీజర్ అంచనాలను మరింత పెంచింది. ‘కామెడీ గోస్ కాస్మిక్’ అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగా స్వర్గలోకం, అప్సరసలు, కోరికలు, కామెడీని కలిపి ఈ చిత్రాన్ని రూపొందించారు. చిన్నతనంలో హీరోకు ఓ ప్రత్యేకమైన కోరికల పుస్తకం దొరుకుతుంది. అందులో చెప్పిన విధంగా పూజలు చేస్తే రంభ, ఊర్వశి, మేనకలు భూలోకానికి వచ్చి కోరికలు తీరుస్తారని తెలుసుకుంటాడు. దీంతో 25 ఏళ్ల పాటు పూజలు చేసి చివరకు వారిని భూమిపైకి రప్పిస్తాడు. అక్కడి నుంచే అసలు కామెడీ మొదలవుతుంది.
రంభగా రాశి సింగ్, ఊర్వశిగా విష్ణుప్రియ, మేనకగా ప్రిషా సింగ్ నటిస్తుండగా, దేవేంద్రుడిగా వెన్నెల కిషోర్ నవ్వులు పూయించనున్నారు. నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా, ప్రసాద్ నిమ్మకాయల నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ అందిస్తున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత అల్లరి నరేష్ ఫాంటసీ జానర్‌లోకి తిరిగి వస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!