

‘మైసా’ సినిమా చిత్రీకరణలో గాయపడిన నటి రష్మిక మందన్న పూర్తిగా కోలుకున్నారు. త్వరలోనే తిరిగి తన వర్క్ షెడ్యూల్‌లో బిజీ కానున్నారు. తన గాయం, విశ్రాంతి రోజులను గుర్తుచేసుకుంటూ రష్మిక సరదాగా మాట్లాడారు. పెళ్లి తర్వాత తాము దాదాపు మూడు నెలల పాటు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకోలేదని, తమ తమ పనులతో బిజీగా ఉండటంతో ఫోన్‌లోనే ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు. అయితే తనకు గాయం కావడంతో ఇంట్లోనే ఉండి భర్త విజయ్ దేవరకొండతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికిందని సరదాగా వ్యాఖ్యానించారు.
విశ్రాంతి సమయంలో ఇద్దరూ కలిసి ఇంట్లో ఆనందంగా గడిపామని రష్మిక తెలిపారు. విజయ్‌కు సీరియస్ డ్రామాలు, షోలు ఇష్టమని, తనకు మాత్రం కే-డ్రామాలంటే చాలా ఇష్టమని చెప్పారు. తాను విజయ్‌కు కూడా కే-డ్రామాలు అలవాటు చేశానని నవ్వుతూ వెల్లడించారు. విజయ్ తనను ఎప్పుడూ ఆటపట్టిస్తూ.. ‘మనం ఇలాగే ఎన్నో రోజులు కలిసి గడపాలి.. కానీ గాయాలు లేకుండా’ అంటూ సరదాగా జోక్స్ వేసేవాడని గుర్తుచేసుకున్నారు. విశ్రాంతి తీసుకున్న ఆ రోజులు తనకు ఎప్పటికీ మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని చెప్పారు. ‘మైసా’ షూటింగ్‌లో ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా రష్మిక తుంటి భాగంలో బలమైన గాయం కావడంతో కొన్ని వారాలు విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ముగింపు దశలో ఉండగా, నవంబర్ 27న పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటిస్తున్న ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!