
బిజినెస్

కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్ దేశీయ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు దూకుడు పెంచింది. మార్కెట్‌లో రెండో స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ రెండు కొత్త ఎస్‌యూవీలను విడుదల చేయడంతోపాటు కొత్త ఈవీ మోడల్‌ను కూడా తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ ఎండీ, సీఈఓ తరుణ్ గార్గ్ వెల్లడించారు.
దేశీయంగా వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత పండుగ సీజన్‌లో కొత్త మధ్యస్థాయి ఎస్‌యూవీతో పాటు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఏసీఎంఏ వార్షిక సమావేశంలో వెల్లడించారు. ఈ కొత్త మోడళ్లతో భారత మార్కెట్లో తమ స్థాయిని మరింత పెంచుకోవాలని హ్యుందాయ్ భావిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!