

రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రం విడుదలైన తొలిరోజు నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా రూ.200 కోట్ల వసూళ్లను సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. మాస్ ఇమేజ్‌కు భిన్నంగా సాధారణ మధ్యతరగతి తండ్రి త్రినాథ్ పాత్రలో రవితేజ కనిపించడం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కూతురు మణెమ్మ కోసం పరితపించే తండ్రిగా ఆయన భావోద్వేగభరిత నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే 41 రోజుల అయ్యప్ప దీక్ష నేపథ్యంలో కథను నడిపించడం, ఆధ్యాత్మిక అంశాలను భావోద్వేగాలతో మేళవించడం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
సినిమాలోని ఊహించని మలుపులు, క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. కూతురిపై ప్రేమను చూపించడంతో పాటు సమాజంలో అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాలపై హీరో పోరాడటం కూడా సినిమాకు బలమైన అంశంగా మారింది. ఇక తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ‘మల్లెపూల పల్లకి’ పాటను సినిమాలో ప్రత్యేకంగా చూపించడం, ‘యాలాలో.. యాలాలో’, ‘కార్తీకమాసం’ పాటలు ఆకట్టుకోవడం కూడా విజయానికి దోహదపడ్డాయి. ఈ అంశాలన్నీ కలిసి ‘ఇరుముడి’ని ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయని విశ్లేషణ.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!