

రొమాంచకం చిత్రంలో అనంతిక సనిల్‌కుమార్‌తో కలిసి నటించిన సుమంత్ ప్రభాస్ తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన సినిమా కోసం ప్రభాస్‌ను కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయనను కలిసిన వెంటనే తన గతం, ఇప్పటివరకు సాగిన జర్నీ మొత్తం ఒక్కసారిగా గుర్తొచ్చిందన్నారు. ప్రభాస్ చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారని, ఆయనలోని ఫ్యాన్‌బాయ్ ప్రేమ కనిపించిందని చెప్పారు. తమ కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదని, తనను సినిమాల్లోకి రావడంలో పెద్దగా సపోర్ట్ చేయలేకపోయినా పాజిటివ్‌గా ఉండాలని సూచించారని తెలిపారు.
రొమాంచకం సినిమాలో ఇంజినీరింగ్ పూర్తి చేసి స్టార్టప్ ప్రారంభించాలని ప్రయత్నించే యువకుడిగా కనిపిస్తానని సుమంత్ చెప్పారు. తన పాత్రకు తగ్గట్టుగా మారేందుకు దర్శకుడు వేణు గోపాల్‌రెడ్డి ఆరు నెలల పాటు వర్క్‌షాప్స్ నిర్వహించారని, వాటి వల్ల తన నటన మరింత మెరుగుపడిందని తెలిపారు. అనంతిక ఎంతో ప్రతిభావంతురాలని, ఆమెతో కలిసి పనిచేయడం మంచి అనుభవమని ప్రశంసించారు. హీరోగా అన్ని రకాల కథల్లో నటించాలని ఉందని, ప్రస్తుతం ప్రేమకథలు వస్తున్నాయని, భవిష్యత్‌లో యాక్షన్, కమర్షియల్ సినిమాలు చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానన్నారు. దర్శకుడు సాయిలు కంపాటి దర్శకత్వంలో తన తదుపరి సినిమా ఈ నెలలోనే ప్రారంభం కానుందని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!