3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్‌..

Writer: Chandrika 09:33 AM, 3 సెప్టెంబర్, 2026
బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్‌..

సికింద్రాబాద్‌ బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు రోజురోజుకూ జటిలమవుతోంది. కేసు నమోదై 48 గంటలు గడిచినా ఇప్పటివరకు కీలక ఆధారం లభించకపోవడం పోలీసులను, సైనిక అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. చోరీకి గురైన ఆయుధాలు సంఘవిద్రోహ లేదా దేశవిద్రోహ శక్తుల చేతుల్లోకి వెళితే తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉండటంతో అధికారులు ప్రతి కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. చోరీ చేసిన ఆయుధాలకు సరిపోయే మందుగుండు సామగ్రిని కూడా దుండగులు తీసుకెళ్లినట్లు గుర్తించడం అధికారులను విస్మయానికి గురిచేసింది. దీంతో ఇది పక్కా ప్రణాళికతో జరిగిన చోరీ అయి ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆయుధాగారం, అందులోని నిల్వలు, రెజిమెంట్‌ భౌగోళిక పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లపై పూర్తి అవగాహన ఉన్నవారి ప్రమేయం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని పోలీసులు, సైనిక అధికారులు విచారిస్తున్నారు. రెజిమెంట్‌కు దారితీసే మార్గాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. గత కొంతకాలంగా అవకాశం దొరికినప్పుడల్లా మందుగుండు సామగ్రిని కొద్దికొద్దిగా తరలించి, అనంతరం ఆయుధాలను చోరీ చేసి ఉండవచ్చనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి నిల్వలకు సంబంధించిన రికార్డుల నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తాళం పగులగొట్టడం, మందుగుండు పెట్టెలను ధ్వంసం చేసినప్పటికీ సమీపంలోని సిబ్బందికి ఎలాంటి శబ్దం వినిపించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో రెజిమెంట్‌లో పనిచేసే వారిలో ఎవరినైనా హనీట్రాప్‌ ద్వారా ప్రభావితం చేసి చోరీకి సహకరింపజేశారా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సిబ్బంది ఫోన్లు, సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలిస్తూ.. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఏమైనా ఉందా అనే అంశాన్ని కూడా ఆరా తీస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?

టెక్‌ రంగంలో పెరుగుతున్న లేఆఫ్‌లు..

టెక్‌ రంగంలో పెరుగుతున్న లేఆఫ్‌లు..

కేరళంలో కిమ్స్ హాస్పిటల్ విస్తరణ

కేరళంలో కిమ్స్ హాస్పిటల్ విస్తరణ

బొల్లారంలో ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌ సమీపంలో డిటోనేటర్లు..

బొల్లారంలో ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌ సమీపంలో డిటోనేటర్లు..

రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడా? పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు!

రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడా? పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు!

అమెరికాలో పుట్టిన పిల్లల పాస్‌పోర్ట్‌కు కొత్త నిబంధనలు.. తల్లిదండ్రులకు ఇక ఇవి తప్పనిసరి!

అమెరికాలో పుట్టిన పిల్లల పాస్‌పోర్ట్‌కు కొత్త నిబంధనలు.. తల్లిదండ్రులకు ఇక ఇవి తప్పనిసరి!

ట్యాగ్లు
బొల్లారంమద్రాస్‌ రెజిమెంట్‌ఆర్మీ ఆయుధాల చోరీహైదరాబాద్‌ క్రైమ్‌ఆర్మీ భద్రతఆయుధాల చోరీ కేసుహనీట్రాప్‌ కోణంరక్షణ వార్తలుతెలంగాణ క్రైమ్‌పోలీసుల దర్యాప్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?
జనరల్

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?

‘డ్రాగన్’ షూట్, రిలీజ్‌పై మేకర్స్ స్పష్టత!
సినిమాలు

‘డ్రాగన్’ షూట్, రిలీజ్‌పై మేకర్స్ స్పష్టత!

టెక్‌ రంగంలో పెరుగుతున్న లేఆఫ్‌లు..
జనరల్

టెక్‌ రంగంలో పెరుగుతున్న లేఆఫ్‌లు..

డబుల్ సెంచరీతో ‘ఇరుముడి’ కొత్త రికార్డు
సినిమాలు

డబుల్ సెంచరీతో ‘ఇరుముడి’ కొత్త రికార్డు

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్‌..
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్‌..

‘ఇరుముడి’ సీక్వెల్‌లో రామ్ చరణ్ లేరట?
గాసిప్స్

‘ఇరుముడి’ సీక్వెల్‌లో రామ్ చరణ్ లేరట?

కేరళంలో కిమ్స్ హాస్పిటల్ విస్తరణ
జనరల్

కేరళంలో కిమ్స్ హాస్పిటల్ విస్తరణ

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్?
గాసిప్స్

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్?

విజయ్‌ దేవరకొండతో క్వాలిటీ టైమ్‌పై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు...
సినిమాలు

విజయ్‌ దేవరకొండతో క్వాలిటీ టైమ్‌పై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు...

దుల్కర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు షోస్ రద్దు?
గాసిప్స్

దుల్కర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు షోస్ రద్దు?

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..
ఆరోగ్యం

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

భారత మార్కెట్‌లో హ్యుందాయ్‌ కీలక అడుగు
బిజినెస్

భారత మార్కెట్‌లో హ్యుందాయ్‌ కీలక అడుగు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!